ఇంటిగ్రేటెడ్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను వెంటనే పూర్తిచేయాలి

ఇంటిగ్రేటెడ్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను వెంటనే పూర్తిచేయాలి

కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్​హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ​నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. అంతకుముందు శనిగరం గ్రామంలో పర్యటించారు.